- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయ్యో పాపం.. అక్కడ ఆగమాగం
దిశ, ఆదిలాబాద్: పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం పోయారు. క్లిష్ట పరిస్థితులు వెంటాడి ఎక్కడికీ వెళ్లలేక అక్కడే చిక్కిపోయారు. అక్కడ ఆశ్రయం దొరకక అవస్థలు పడుతూ అడవిలో వుంటున్నారు. వీరి దీనగాథపై ప్రత్యేక కథనం.. అదేంటో మీరే చూడండి.
నిర్మల్ జిల్లాకు చెందిన కొంతమంది పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్లి అక్కడే చిక్కుకున్నారు. కరోనా కారణంగా ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్నందునా వారు అక్కడ తిండితిప్పలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి గ్రామాల్లో వీధివ్యాపారం చేసుకుంటున్న తమకు కరోనా ఆశనిపాతంలా మారిందని వారు ఆవేదన చెందుతున్నారు. దీంతో వారు తమను ఇక్కడికి రప్పించాలని కోరుతున్నారు.
వెళ్లగొట్టడంతో ఊరి బయట జీవనం…
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసంపల్లె గ్రామానికి చెందిన పలు సంచారజాతి కుటుంబాలు జీవనోపాధి కోసం జార్ఖండ్ రాష్ట్రంలోని రాంఘడ్ జిల్లాకు వెళ్లారు. అక్కడి మధునాపూర్ గ్రామంలో ఇల్లిల్లు తిరుగుతూ చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న తరుణంలో కరోనా కారణంగా వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ విషయాన్ని అక్కడ ఉన్న గంధం గంగన్న, శ్రీనివాస్, బుచ్చన్నలు అక్కడి నుండి ఫోన్ ద్వారా తమ బంధువులకు సమాచారం అందించారు. కరోనా కారణంగా అక్కడి గ్రామాల ప్రజలు మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టారని తెలిపారు. మీరు ఎక్కడివారో… మీకు కరోనా ఉండవచ్చు, మా ఊరి నుండి వెళ్ళిపోండని హెచ్చరించడంతో బయటకు వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏమీ తోచక గ్రామాలకు దూరంగా గుడిసెలు వేసుకొని ఉంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే 15 రోజులు గడిచిపోగా తమ వద్ద తినుబండరాలు, సామాగ్రీ అయిపోయాయని తెలిపారు.
మమ్మల్ని రప్పించండి..
కరోనాతో అందరికీ దూరంగా, జీవనోపాధి లేకుండా జార్ఖండ్ రాష్ట్రంలో పస్తులు ఉండే పరిస్థితి నెలకొందని ఆవేదన చెందుతూ.. తమను ఎలాగైనా స్వగ్రామాలకు రప్పించేలా చొరవ చూపాలని ఆ సంచార కుటుంబాలు కోరుతున్నాయి. కాగా, వీరంతా కూడా కాలినడకను సొంత గ్రామాలకు బయలుదేరినట్టు సమాచారం.
Tags: Nirmal, Jarkhand, migrants, phone, corona Effect