కరోనా లక్షణాలతో వలస కూలీలు ఆస్పత్రికి తరలింపు

by Shyam |

దిశ, నల్గొండ: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిపల్లికి చెందిన వలస కూలీలకు కరోనా లక్షణాలు ఉండడంతో.. అధికారులు వారిని హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇందులో ఏడుగురు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. యాదగిరిపల్లికి చెందిన 8 మంది బతుకుదెరువు కోసం మహారాష్ట్ర వెళ్లి కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే, లాక్‌డౌన్ కారణంగా అక్కడ పనులు లేకపోవడంతో పిల్లలతో సహా 11 మంది తిరిగి స్వగ్రామానికి వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని యాదగిరిగుట్ట ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే పోలీసులు, కూలీలకు మధ్య వాగ్వాదం జరిగింది. కూలీలకు పరిస్థితిని వివరించిన పోలీసులు.. పరీక్షలు చేయించారు. కాగా, ఇందులో ఏడుగురికి తీవ్ర జ్వరం ఉందని వైద్యులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలోనే వారిని కొవిడ్ పరీక్షల నిమిత్తం అంబులెన్సులో హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story