తిండి కోసం చెత్తకుప్ప దగ్గరకు వలస కార్మికులు

by vinod kumar |
తిండి కోసం చెత్తకుప్ప దగ్గరకు వలస కార్మికులు
X

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌తో వలస కార్మికుల బాధలు చెప్పనలవికావడం లేదు. ఢిల్లీలో ఆహారం కోసం కొందరు వలస కార్మికులు చెత్తకుప్పలో పడేసిన అరటి పండ్ల కోసం ఎగబడ్డారు. ఓ స్మశానం పక్కనే పారబోసిన అరటి పండ్ల కుప్పలో నుంచి బాగున్నవాటి కోసం ఎరుకుంటూ కనిపించారు. బహుశా అంత్యక్రియల్లో భాగంగా పడేసిని ఆ అరటి పండ్లతో ఆకలి తీర్చుకునేందుకు పోటీపడ్డ వలస కార్మికులు యమునా నదీ తీరంలోని నిగంబోధ్ ఘాట్ దగ్గర కనిపించారు. రెగ్యులర్‌గా ఆహారం అందట్లేదని అందుకే ఈ అరటి పండ్లైనా కడుపు నింపుతాయని ఆశపడుతున్నట్టు యూపీకి చెందిన ఓ కార్మికుడు చెప్పాడు. కాగా, ఈ ఘటనపై రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించాడు. వారందరిని ఓ స్కూల్‌లో ఏర్పాటు చేసిన షెల్టర్‌లోకి పంపిస్తున్నట్టు ఢిల్లీ అర్బన్ షెల్టర్ బోర్డుకు చెందిన విపిన్ రాయ్ తెలిపారు.

Tags: migrant workers, delhi, banana, trash, delhi, yamuna bank, shelter, lockdown

Advertisement

Next Story