స్వరాష్ట్రానికి వలస కార్మికులు

by Shyam |
స్వరాష్ట్రానికి వలస కార్మికులు
X

దిశ, మహబూబ్ నగర్ :
మహబూబ్ నగర్ జిల్లాలో పని చేస్తున్న ఇటుకబట్టి కార్మికులను తమ సొంత రాష్ట్రానికి పంపించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పట్టణంలోని ధర్మపూర్, ఎర్రవల్లి తండా, దొడ్డలోనిపల్లి గ్రామాల్లో ఉన్న 300 మంది ఒరిస్సా వాసులను పట్టణ కేంద్రం నుంచి ఘట్కేసర్ వరకు బస్సులో తీసుకెళ్లి, అక్కడి నుంచి రైళ్ళలో వారి స్వస్థలాలకు పంపిస్తామన్నారు.ఈ సందర్భంగా ఎక్సైజ్ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ బస్సులలో వారికి చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అందరూ మాస్క్ ధరించి, శానిటైజర్ ఉపయోగిస్తూనే భౌతిక దూరం పాటించాలని సూచించారు. లాక్‌డౌన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిత్యావసర సరుకులు వారికి అందించామని, ఇక్కడ వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నామన్నారు. ఒరిస్సా వెళ్ళిన వారు మళ్ళీ మహబూబ్ నగర్‌కు వస్తారా? అన్న ప్రశ్నకు సమాధానంగా లాక్‌డౌన్ సమయంలో కూడా తాము ఇటుక బట్టిల్లో ఇటుకలు చేశామన్నారు. సీజన్ అయిపోయినందున తమ స్వస్థలాలకు వెళుతున్నట్లు వలస కూలీలు తెలిపారు. మళ్ళీ వర్షాకాలం అయిపోయాక, సీజన్‌లో జిల్లాకు వస్తామని మంత్రికి సమాధానం ఇచ్చారు.

Advertisement

Next Story