- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాడో పేడో.. సమ్మెకు ‘సై’అంటున్న మధ్యాహ్న భోజన కార్మికులు
దిశ, జగిత్యాల : ఐక్యకేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు సెప్టెంబర్ 24 నుంచి అఖిల భారత సమ్మెలో పాల్గొంటున్నామని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు కె.సరస్వతి తెలిపారు. శనివారం జగిత్యాల జిల్లా విద్యాశాఖ అధికారికి సమ్మె నోటీస్ ఇచ్చిన అనంతరం జగిత్యాల ప్రెస్‌క్లబ్‌లో ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తమ డిమాండ్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమావళిని రూపొందించిదన్నారు. అమలుకు నోచుకోని తమ డిమాండ్ల సాధనకై దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు ఐక్యమై కేంద్ర కార్మిక సంఘాల సారథ్యంలో ఈ నెల 24 నుంచి అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చారని తెలిపారు.
కార్మికుల డిమాండ్లతో పాటు భోజన పథకంలోని కార్మికుల సమస్యలపై సమ్మె నోటీస్ ఇచ్చామన్నారు. పెండింగులో ఉన్న వంట కార్మికుల కనీస వేతనాలు, ప్రతినెలా 5 లోపు మెస్ బిల్లుల చెల్లింపు, మెస్ చార్జి 15 వేల డిమాండ్, రాయితీ గ్యాస్ సరఫరా, కోడిగుడ్ల కై ప్రత్యేక బడ్జెట్, వంట కార్మికులకు గుర్తింపు నిచ్చి స్కీమ్ వర్కర్లుగా గుర్తింపు, ప్రమాద బీమా, పని భద్రత, పీఎఫ్ సౌకర్యం, ప్రతీ బడిలో వంటగది ఏర్పాటు చేయాలన్నారు. స్వచ్ఛంద సంస్థలకు భోజన సరఫరా అప్పగింత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరికొన్ని డిమాండ్లతో సమ్మెలోకి వెళ్తున్నామని జిల్లా అధ్యక్షురాలు సరస్వతి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎండీ ముక్రం, అల్తాఫ్, వెన్న సురేష్, రామక్క, కిరణ్, హన్మంతుతో పాటు పలువురు ఉన్నారు.