కరోనా సంక్షోభంలోనూ..మైక్రోసాఫ్ట్ కొత్త ఉద్యోగాల సృష్టి!

by Shyam |
కరోనా సంక్షోభంలోనూ..మైక్రోసాఫ్ట్ కొత్త ఉద్యోగాల సృష్టి!
X

దిశ, సెంట్రల్ డెస్క్ :
కరోనా దెబ్బకు ప్రపంచదేశాలు విలవిలలాడుతున్నాయి.అగ్రరాజ్యం అమెరికాలో అయితే వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరిగిపోవడంతో పాటు, మరణాలు కూడా అధికంగా సంభవిస్తున్నాయి. కరోనా ప్రభావం ఉన్న దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనావస్థకు చేరుకున్నాయి.ఇప్పటికే చాలా దేశాల్లోని పెద్ద పెద్ద కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులకు ఉద్వానస పలికాయి.దీంతో జాబ్స్ కోల్పొయి చాలా మంది రోడ్డున పడ్డారు. మరల ఆర్థిక వ్యవస్థలు పుంజుకోవాలంటే ఆయా దేశాల ప్రభుత్వాలు, నిపుణులు ఆర్థిక రంగానికి ఊతమిచ్చే చర్యలు చేపట్టాలని కొన్ని సర్వేలు నివేదికలు వెల్లడించాయి. ఈలాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రపంచ సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ అందరికంటే భిన్నంగా కొత్తగా ఉద్యోగాల కల్పనకు ఆలోచన చేస్తోంది.కరోనా సంక్షోభంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్లౌడ్ స్పేస్ విభాగాల్లో కొత్తగా 1500 ఉద్యోగాలు సృష్టించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం 75 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 550 కోట్లు) పెట్టుబడితో 5,23,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది.జార్జియాలోని అట్లాంటాలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. వచ్చే ఏడాదికల్లా అట్లాంటాలో మైక్రోసాఫ్ట్ కొత్త కార్యాలయం రూపుదిద్దుకోనుంది.ప్రస్తుత పరిస్థితుల్లో మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ దిగ్గజం పెట్టుబడులతో ముందుకు రావడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని జార్జియా గవర్నర్ బ్రియాన్ కెంప్ తెలిపారు.ఈ నిర్ణయం వలన ఓవైపు సంస్థకు, రాష్ట్రానికి ప్రయోజనాలుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.దీనిపై మైక్రోసాఫ్ట్ జనరల్ మేనేజర్ టెరెల్ కాక్ స్పందిస్తూ..టెక్ కంపెనీలకు కేంద్రంగా అట్లాంటాలో తాము పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందని, దీంతో మా ఉనికి మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుందన్నారు.తమ నిర్ణయం వల్ల సంస్థకు సాంకేతికంగా, ఆర్థికంగా ఎంతో లాభం చేకూరనున్నట్టు టెరెల్ తెలిపారు.కాగా, కరోనా సంక్షోభంలోనూ మైక్రోసాఫ్ట్ సంస్థ త్రైమాసిక ఫలితాల్లో భారీగా లాభాలు, ఆదాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story