మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లో ‘పర్సనల్ లైఫ్’ ఫీచర్స్

by Shyam |
మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లో ‘పర్సనల్ లైఫ్’ ఫీచర్స్
X

దిశ, ఫీచర్స్ : మైక్రోసాఫ్ట్ తమ టీమ్స్ వినియోగదారుల కోసం ‘పర్సనల్ లైఫ్’ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ సాయంతో మైక్రోసాఫ్ట్ టీమ్స్ యూజర్లు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఓకే చోట ఉచితంగా వీడియో కాల్స్ , చాటింగ్, ప్లానింగ్, ఆర్గనైజ్ చేసుకోవచ్చు.

మైక్రోసాఫ్ట్ తమ టీమ్స్ వినియోగదారుల ‘పర్సనల్ యూసేజ్’ కోసం మేజర్ ఫీచర్స్ ఆఫర్ చేస్తుంది. ఉదాహరణకు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ‘టుగెదర్ మోడ్’‌లో వీడియో కాల్స్ చేయవచ్చు. టీమ్స్ యూజర్స్ ఇతర టీమ్ యూజర్స్‌తో ఒకరితో ఒకరు(వన్ టు వన్) 24 గంటల వరకు ఉచితంగా కాల్స్ మాట్లాడుకునే అవకాశం ఉంది. అయితే ఇదివరకు గ్రూప్ కాల్ కోసం (ఇద్దరు వ్యక్తుల కంటే ఎక్కువ), మీరు 100 మంది వరకు పార్టిసిపెంట్స్‌ను ఇన్వైట్ చేయొచ్చు. ఈ గ్రూప్ కాల్ 60 నిమిషాల వరకు ఉచితంగా మాట్లాడొచ్చు. కొవిడ్ -19 పరిస్థితుల వల్ల మైక్రోసాఫ్ట్ దీనిపై పరిమితులను మాఫీ చేసింది. దాంతో మీరు 300 మంది పార్టిసిపెంట్స్‌తో 24 గంటల వరకు ఉచితంగా మాట్లాడవచ్చు.

టీమ్ అకౌంట్స్ లేని వారితో సహా గ్రూప్ చాట్‌లను కూడా వినియోగదారులు హోస్ట్ చేసే అవకాశముంది. అంతేకాదు లైవ్ రియాక్షన్స్, జిఫ్‌లను కూడా సెండ్ చేయొచ్చు. పోల్స్ కూడా హోస్ట్ చేసే సదుపాయముంది.

టీమ్స్‌లో పర్సనల్ ఫీచర్స్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉన్నాయి. మీరు ఇప్పటికే ‘వర్క్’ కోసం టీమ్స్ ఉపయోగిస్తుంటే, పర్సనల్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేయడానికి మీ ప్రొఫైల్‌పై క్లిక్ చేయండి. న్యూ యూజర్స్ కోసం iOS, Android వెర్షన్స్‌తో పాటు, డెస్క్‌టాప్ యాప్ కూడా ఉంది. మీరు వెబ్ బ్రౌజర్ ద్వారా కూడా మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాక్సెస్ చేయవచ్చు.

Advertisement

Next Story