- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Trisha: తమిళ హీరోతో డేటింగ్.. తొలిసారి స్పందించిన స్టార్ హీరోయిన్.. అసలు ఇది మామూలు షాక్ కాదుగా..!
దిశ, సినిమా: అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష(Thrisha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వర్షం(Varsham) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ఈ మూవీలోని తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఈ భామ ఇండస్ట్రీకి దూరమైంది. కానీ కారణం ఏంటో తెలియదు. ఇక ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. అది కూడా మామూలు అందంతో కాదు. ఈ భామను చూస్తే యంగ్ హీరోయిన్స్ కూడా కుల్లుకోక తప్పదు అని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘విశ్వంభర’(Vishwambhara)లో నటిస్తోంది. అలాగే అజిత్(Ajith) హీరోగా నటిస్తున్న ‘విడామూయార్చి’(Vidamuyarchi)తో పాటు మరో రెండు తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇలా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా కోలీవుడ్ స్టార్ విజయ్(Tamil Star Vijay) నటించిన ‘లియో’(Leo) మూవీలో హీరోయిన్‌గా త్రిష మెప్పించింది. ఇక విజయ్, త్రిషల జోడీ కూడా సూపర్‌గా ఉన్నది. ఈ క్రమంలో వీరిద్దరు డేటింగ్(Dating)లో ఉన్నారు. పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పలు పుకార్లు నెట్టింట షికారు చేసింది. అయితే ఈ వార్తలపై త్రిష తాజాగా స్పందించింది.
ఆమె మాట్లాడుతూ.. “సోషల్ మీడియాలో నాపై ఇష్టమొచ్చినట్టు రాస్తుంటారు. వాటిని పట్టించుకోని నేను నా ఎనర్జీని వృధా చేసుకోను. నాకంటూ బోలేడు పనులున్నాయి. ఇలాంటి పనికి మాలిన వాటికి స్పందించాల్సిన అవసరం లేదు”.. అంటూ ఘాటుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇప్పటికైన ఈ డేటింగ్ రూమర్స్‌కి చెక్ పడుతుందో లేదో చూడాలి.