మైక్రోమ్యాక్స్ ట్రిపుల్ ధమాకా

by Harish |
మైక్రోమ్యాక్స్ ట్రిపుల్ ధమాకా
X

దిశ, వెబ్‌డెస్క్: చైనాతో సరిహద్దులో జరిగిన ఘర్షణలో భారత జవాన్లు మృతిచెందడం పట్ల దేశ ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో ‘స్వదేశీ వస్తువులనే వినియోగిద్దాం.. చైనా ఉత్పత్తులను నిషేదిద్ధాం’ అంటూ పిలుపునిస్తున్నారు. అంతేకాకుండా చైనా టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రిక్‌ పరికరాలను దేశంలోని పలు చోట్ల ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ మైక్రోమాక్స్‌ త్వరలో మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మైక్రోమ్యాక్స్ నుంచి ఇండియాలో గత అక్టోబర్‌లో విడుదలైన ‘iOne Note’ స్మార్ట్‌ఫోన్‌ చివరిది కాగా.. అప్పటినుంచి మరో ఫోన్ విడుదల కాకపోవడం గమనార్హం.

ఇకపై తమ కంపెనీ నుంచి రాబోయే ఫోన్లన్నీ కూడా బడ్జెట్ ధరలోనే ఉంటాయని వెల్లడించింది. ఇదే సమయంలో చైనా ఫోన్లకు ప్రత్యామ్నాయంగా సరికొత్త స్మార్ట్ ఫోన్లను తయారు చేయాలని నెటిజన్ల నుంచి కూడా మద్ధతు వస్తుండటంతో.. మైక్రోమ్యాక్స్ కూడా ఇదే మంచి తరుణమని ఆలోచిస్తోంది. ఈ క్రమంలో ఒకేసారి మూడు ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు రెడీ అయ్యింది. అయితే ఈ ఫోన్ల ధరలన్నీ రూ. 10 వేల లోపే ఉంటాయని తెలపడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed