- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీ20 వరల్డ్ కప్ ఇండియాదే.. మాజీ ఆటగాడు హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ఎప్పటికప్పుడు సంచలనాల కామెంట్స్‌తో ట్విట్టర్‌లో చురుగ్గా ఉండే ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ ఈసారి మాత్రం విమర్శలకు తావివ్వకుండా ట్వీట్ చేసాడు. ఇప్పటికే ఇండియా ఆడిన రెండు వార్మప్ మ్యాచుల్లో వార్ వన్ సైడ్ అన్నరీతిలో రెచ్చిపోయింది. ఈ ప్రదర్శనలో భాగంగా ఇండియా ఆటతీరుపై స్పందించిన వాన్ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేసాడు.
టీ20 ప్రపంచకప్ 2021 వార్మప్ మ్యాచుల్లో భారత్ ఆడిన తీరు అద్భుతంగా ఉందని, టైటిల్ గెలిచేందుకు టీమిండియానే హాట్ ఫెవరేట్‌గా ఉన్నట్లు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ‘వార్మప్ మ్యాచుల్లో భారత్ ఆడిన తీరు అద్భుతంగా ఉంది. భారత్ ఆడిన తీరు చూస్తే.. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2021 టైటిల్ గెలిచేందుకు హాట్ ఫెవరేట్‌గా భారత్ కనిపిస్తోంది’ అని మైఖేల్ వాన్ బుధవారం ట్వీట్ చేసాడు. టీ20 ప్రపంచకప్ 2021లో టీమిండియాకు ఎంఎస్ ధోనీని మెంటార్‌గా నియమించి BCCI మంచి నిర్ణయం తీసుకుందని వాన్ అభిప్రాయపడ్డాడు.