- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాన్న నల్లగా ఉన్నాడని అమ్మవాళ్లు వివక్ష చూపించారు: హోల్డింగ్
దిశ, స్పోర్ట్స్: అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ జాత్యాహంకార హత్య తర్వాత ప్రపంచవ్యాప్తంగా జాతి వివక్షపై ఉద్యమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లండ్, వెస్టిండీస్ టెస్టు మ్యాచ్‌లో ఆటగాళ్లు నల్లజాతీయులపై వివక్షకు నిరసనగా ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ అనే లోగోలు జెర్సీలపై ధరించి ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విండీస్ మాజీ క్రికెటర్ మైఖేల్ హోల్డింగ్ తన జీవితంలో ఎదుర్కొన్న జాతి వివక్షత గురించి చెబుతూ లైవ్‌లోనే కన్నీటి పర్యంతమయ్యారు. జాతి వివక్ష కారణంగా తాను పడిన క్షోభను తలచుకుని బోరున విలపించాడు. ప్రజలు తమ ఆలోచనా ధోరణిని మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘నిజం చెప్పాలంటే ఇలా భావోద్వేగం చెందడానికి కారణం నా తల్లిదండ్రులను తలుచుకోవడమే. ఇప్పుడు కూడా ఏడుపొస్తుంది. మా తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో నాకు తెలుసు. మా నాన్న నల్లగా ఉన్నాడని మా అమ్మవాళ్ల కుటుంబం ఆమెతో మాట్లాడలేదు. వాళ్లు ఎలాంటి మానసిక క్షోభను అనుభవించారో నాకు తెలుసు. అదే ఇప్పుడు నాకు గుర్తొచ్చింది’ అని హోల్డింగ్ ఏడ్చేశాడు. నేను ఏడ్చి సానుభూతి పొంద దల్చుకోలేదు. కేవలం నా మనసులో నాటుకుపోయిన బాధను వెల్లడించాను‘ అని హోల్డింగ్ స్పష్టం చేశాడు.