- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఉపాధి' కూలీలు భౌతికదూరం పాటించాలి: కలెక్టర్ శరత్
దిశ, నిజామాబాబాద్: ఉపాధి హామీ కూలీలు భౌతికదూరం పాటిస్తూ పనులు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ సూచించారు. అటవీ ప్రాంతంలో కందకాలు తవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలపై ఆయన కూలీలతో మాట్లాడారు. శనివారం మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లిలో తవ్విన కంధకాలను కలెక్టర్ శరత్ పరిశీలించారు. అటవీ ప్రాంతంలో కందకాలు తవ్వడం వల్ల వర్షపు నీరు నిలిచి భూగర్భ జలాలు పెరుగుతాయని కూలీలకు కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి ఉపాధి హామీ పనులు చేయాలని కోరారు. మాస్కులు ధరించడం వల్ల దుమ్ము, ధూళి నోటిలోకి రాకుండా అడ్డుకుంటుందని పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో సీమచింత, నేరేడు, ఉసిరి, మామిడి, జామ వంటి మొక్కలు పెంచాలన్నారు. అటవీ ప్రాంతం చుట్టూ బౌండరీ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. అనంతరం రాజుఖాన్‌పేట్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ శరత్ పరిశీలించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలని రైతులకు సూచించారు. రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించి మోసపోవద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ చంద్రమోహన్ రెడ్డి, సర్పంచ్ శ్రీశైలం, కార్యదర్శి గంగమణి, ఏపీఓ హరిబాబురెడ్డి, సాంకేతిక సహాయకులు సంతోష్ కుమార్, వ్యవసాయ అధికారి రాజు, అధికారులు పాల్గొన్నారు.