- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా వ్యాక్సిన్‌తో డాక్టర్ అస్వస్థత.. ఐసీయూలో ట్రీట్మెంట్
దిశ,వెబ్ డెస్క్ : అమెరికా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే పలుమార్లు యూఎస్ కు చెందిన ఫైజర్ – బయో ఎన్ టెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ టీకాతో ఆస్పత్రి పాలైన ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా మెక్సికన్ అధికారుల వివరాల ప్రకారం.. 32మహిళా డాక్టర్ ఫైజర్ కరోనా వ్యాక్సిన్ కారణంగా ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. నార్తన్ స్టేట్ ఆఫ్ న్యువో లియోన్ కు చెందిన మహిళా డాక్టర్ ఫైజర్ టీకాను వేయించుకున్నారు. అనంతరం ఆమెకు బ్రీతింగ్ సమస్య, స్కిన్ ఎలర్జీతో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన తోటి డాక్టర్లు ఆమెకు ట్రీట్మెంట్ అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు మెక్సిక్ అధికారులు చెబుతున్నారు. ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్న సదరు మహిళా డాక్టర్‌కు ఎన్సెఫలోమైలిటిస్ (వెన్నుపూస వాయడం, మెదడు వాపు) సమస్యత తలెత్తిందని మెక్సికన్ హెల్త్ మినిస్ట్రీ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
అయితే బాధితురాలికి గతంలో అలెర్జీ సమస్య ఉందని, టీకా వేయించుకున్న తరువాత మెదడులో పెయిన్ వస్తుందన్న ఆధారాలు ఫైజర్ క్లినికల్ ట్రయల్స్‌లో వెలుగులోకి రాలేదని మెక్సికన్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.