బీడీ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మెస్సీ

by Shyam |
బీడీ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మెస్సీ
X

దిశ, స్పోర్ట్స్: దిగ్గజ ఫుట్‌బాలర్, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ ఇండియాలోని బీడీ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. అర్జెంటీనాలో ఉండే మెస్సీ ఏంటీ? బీడీ కంపెనీలకు ప్రచారకర్తేంటి? అని మీకు అనుమానం వచ్చిందా? అయితే ఇది మెస్సీ అధికారికంగా కుదుర్చుకున్న ఒప్పందం కాదు. కోపా అమెరికా కప్‌ను 28 ఏళ్ల తర్వాత గెలిచిన నేపథ్యంలో ఇండియాలో మెస్సీకి ఫ్యాన్స్ భారీగా పెరిగిపోయారు.

దీన్ని సొమ్ము చేసుకోవాలని భావించిన లోకల్ బీడీ కంపెనీ ఒకటి మెస్సీ ఫొటోను బీడీలపై వేయడమే కాకుండా ‘మెస్సీ బీడీ’ అంటూ అమ్మేస్తున్నది. దీన్ని చూసిన మెస్సీ అభిమానులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘కోపా అమెరికా గెలవడానికి సీక్రెట్ ఈ బీడీనే’ అని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు 2018లో రొనాల్డో పేరుతో వచ్చిన బీడీ ఫొటోలను కూడా అభిమానులు వైరల్ చేశారు. రొనాల్డో, మెస్సీలకు ఇండియాలో మొదటి ఎండార్స్‌మెంట్లు అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story