- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ కప్ మరడోనాకు అంకితం : మెస్సీ
దిశ, స్పోర్ట్స్: కోపా అమెరికా కప్‌ను అర్జెంటీనా 28 ఏళ్ల తర్వాత గెలుచుకున్న సంగతి తెలిసిందే. బ్రెజిల్‌తో జరిగిన ఫైనల్‌లో అర్జెంటీనా 1-0 తేడాతో కోపా అమెరికా కప్ ఎగురేసుకొని వెళ్లింది. అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ తన కెరీర్‌లో మొదటి సారి అంతర్జాతీయ కప్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ విజయంపై మెస్సీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. ‘ఈ విజయాన్ని నేను కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, 4.5 కోట్ల అర్జెంటీనా ప్రజలకు అంకితం ఇస్తున్నాను. ముఖ్యంగా ఇటీవల మరణించిన దిగ్గజ ఫుట్‌బాలర్ డిగో మరడోనాకు ఈ కప్ అంకితం ఇస్తున్నాను. ఆయన ఎక్కడ ఉన్నా మమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉంటాడని అనుకుంటున్నాను. ఈ విజయం కోవిడ్ సంక్షోభ సమయంలో నిరాశగా ఉన్న అందరినీ ఉత్తేజపరిచింది. నన్ను అర్జెంటీనాలో పుట్టించిన దేవుడికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని మెస్సీ ఆ పోస్టులో పేర్కొన్నాడు.