- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మెసేజ్ ఇన్ ఏ బాటిల్’@ ప్లాస్టిక్ పొల్యుషన్
దిశ, వెబ్‌డెస్క్: మానవ మనుగడలో ప్లాస్టిక్ ఓ భాగమైపోయింది. దీంతో నదులు, సముద్రాలు, చెరువులు.. ఇలా ప్రతీచోట ప్లాస్టిక్ వ్యర్ధాలు పేరుకుపోతున్నాయి. 2030 నాటికి ప్రపంచ జలాల్లో 53 మిలియన్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు చేరతాయని కెనడా బృందం ఇటీవల చేసిన అధ్యయనంలో తేలింది. ఈ క్రమంలోనే ప్లాస్టిక్ వ్యర్థాలు నదుల్లో ఎంత దూరం వరకు వెళతాయి, వాటివల్ల నదులు, సముద్రాలు ఎలా కలుషితమవుతాయో తెలుసుకునేందుకు ‘నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ – సీ టు సోర్స్’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా బ్రిటన్‌లోని ఎక్సెటర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు భారత్‌లోని గంగా నదిలో, బంగాళాఖాతం, హిందూ మహా సముద్రాల్లో 500 ఎంఎల్ కలిగిన 25 బాటిళ్లను వదిలి పెట్టారు. ఆ బాటిల్స్‌లో శాటిలైట్, జీపీఎస్ ట్యాగ్‌లను ఏర్పాటు చేసి, వాటి ప్రయాణాన్ని రికార్డు చేశారు.
ఇంతకీ ఆ ప్రయోగం ఏంటంటే.. సముద్రాలకు చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల్లో 80 శాతం నదుల ద్వారా వస్తుండగా, ఆ ప్లాస్టిక్ వ్యర్థాలు ఎంత త్వరగా సముద్రాల్లో కలిసిపోతున్నాయో తెలుసుకునేందుకు ‘మెసేజ్ ఇన్ ఏ బాటిల్’ ట్యాగ్ ప్రయోగాన్ని చేపట్టారు. ఇందులో భాగంగానే ప్రయోగానికి 25 బాటిళ్లను ఉపయోగించారు. వాటిలో 22 బాటిళ్లు సరాసరి 165 మైళ్ల (267 కిలోమీటర్లు) దూరం చేరుకోగా, 14 బాటిళ్ల ఆచూకీ మాత్రం దొరకలేదని పరిశోధకులు తెలిపారు. అయితే గంగా నదిలో వదిలేసిన ఓ ప్లాస్టిక్ బాటిల్ మిగితా రెండు వేర్వేరు సముద్రాల్లో వదిలేసిన బాటిళ్లకన్నా ఎక్కువ దూరం ప్రయాణించింది. 94 రోజుల్లో ఆ బాటిల్ 1768 మైళ్లు (2, 845 కిలోమీటర్లు) ప్రయాణించింది.
‘ఈ ప్రయోగం ఆధారంగా ప్రపంచ జలాల్లో ప్లాస్టిక్ పొల్యుషన్ ఎంత వేగంగా విస్తరిస్తుందో తెలుసుకున్నాం. స్కూల్, కాలేజీ విద్యార్థులకు తాము పడేసే ప్లాస్టిక్ వ్యర్థాలు ఎలాంటి వినాశనానికి దారితీస్తున్నాయో తెలపడంతో పాటు వారికి దీనిపై అవగాహన కలిగించొచ్చు’ అని స్టడీ లీడ్ ఆథర్ ఎమిలీ డంకన్ వివరించింది.