- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే అంతేమరి..
by Sumithra |
X
దిశ, నల్లగొండ: అసలే లాక్‌డౌన్.. అయినా మాకేం సంబంధం లేనట్టు గుమిగూడారు. ఇంతలో వారి మధ్య ఘర్షణ చెలరేగి, పెద్ద రాళ్ల వానకు దారితీసింది. రాళ్ల వాన అంటే.. అదేదో ఆకాశం నుంచి పడిందనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఓ భూ తగాదా విషయంలో రెండు వర్గాలు ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకోవడంతో అది కాస్త రాళ్ల వాన దృశ్యాన్ని తలపించింది. ఈ ఘటన దామరచర్ల మండలం వీర్లపాలెంలో చోటుచేసుకుంది. భూ సమస్యను పరిష్కరించుకునేందుకు గురువారం సంబంధిత స్థలం వద్ద లాక్‌డౌన్ నిబంధనలను పక్కన పెట్టిమరీ ఇరువర్గాలు గుమిగూడారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఒకరిపై ఒకరు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. దీంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Next Story