జాతివివక్ష ఉన్నది నిజమే : మెలానియా ట్రంప్

by vinod kumar |
జాతివివక్ష ఉన్నది నిజమే : మెలానియా ట్రంప్
X

దిశ, వెబ్‌డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో జాతి వివక్షను ప్రశ్నిస్తూ ప్రస్తుతం అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ జాతివివక్షపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో ఆమె మాట్లాడుతూ.. అమెరికాలో జాతి వివక్ష కాదన లేని సత్యమని, ఇది కఠినమైనదైనా కాదనలేమని వెల్లడించారు.

అమెరికా హిస్టరీలో ఇలాంటి మచ్చలు అనేకం ఉన్నాయని, వాటిని గుర్తుచేసుకోకపోవడమే మంచిదని పేర్కొన్నారు. ఆ చరిత్ర నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలని కానీ, విద్వేష దాడుల వంటి హింసకు పాల్పడకూడదని సూచించారు. ఇదిలాఉండగా, మెలానియా ట్రంప్ కూడా అమెరికాలో జన్మించలేదు. అయినా, యూఎస్ ఫస్ట్ లేడీగా మారిన వారిలో మెలానియా రెండో మహిళ కావడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed