జూనియర్ చిరును పరిచయం చేసిన మేఘ

by Jakkula Samataha |   ( Updated:2023-08-18 05:04:53.0  )
జూనియర్ చిరును పరిచయం చేసిన మేఘ
X

దిశ, సినిమా : దివంగత కన్నడ హీరో చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్ వాలెంటైన్స్ డే సందర్భంగా అభిమానులకు గొప్ప ట్రీట్ ఇచ్చింది. తమ కొడుకును ప్రపంచానికి పరిచయం చేసిన మేఘన.. ఈ సందర్భంగా బేబీ బాయ్‌‌‌‌కు సంబంధించిన ప్రెట్టీ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో బాబు ఆడుతూ, నవ్వుతూ కనిపిస్తుండగా.. మేఘ బాబును ఎత్తుకుని చిరు ఫొటో ఫ్రేమ్ దగ్గర స్మైలిస్తూ కనిపించిన పిక్ ఎమోషనల్‌ అయ్యేలా చేసింది.

కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన మేఘనా సర్జా.. తమ లిటిల్ ప్రిన్స్‌ను పరిచయం చేస్తున్నట్లు క్యాప్షన్ ఇచ్చింది. ఆ తర్వాత జూనియర్ చిరంజీవి సర్జాకు ప్రేమ, ఆశీర్వాదం అందించిన ప్రతీ ఒక్కరికి థాంక్స్ చెప్పింది. ‘మీరు నేను పుట్టకముందు నుంచే నన్ను ప్రేమిస్తున్నారు. మనం ఫస్ట్ టైమ్ కలుస్తున్న సందర్భంగా అమ్మానాన్నకు ప్రేమ, సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ నా చిన్ని హృదయం లోపలి నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు నా కుటుంబం’ అని క్యాప్షన్ జత చేసింది. జూనియర్ సర్జా అక్టోబర్ 22న జన్మించగా చిరునే మళ్లీ తన రూపంలో తిరిగివచ్చినట్లుగా తెలిపింది. కాగా మేఘ ఐదునెలల ప్రెగ్నెన్సీతో ఉన్న సమయంలో జూన్ 7న చిరంజీవి సర్జా మాసివ్ హార్ట్ ఎటాక్‌తో చనిపోయిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story