బన్నీ, అఖిల్, అకిరాలకు.. చిరు విష్

by Shyam |   ( Updated:2020-04-08 02:22:27.0  )
బన్నీ, అఖిల్, అకిరాలకు..  చిరు విష్
X

మెగాస్టార్ చిరంజీవి … ఈ పేరు ఎంతో మంది హీరోలకు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. తన పేరు చెప్పుకుని ఇండస్ట్రీకి వచ్చిన మెగా కుటుంబం హీరోలు… ఎవరికి వారు గొప్పగా రాణిస్తున్నారు. వీరిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు. తండ్రి అల్లు అరవింద్ నిర్మాత అయినా… మెగా స్టార్ స్ఫూర్తితో, మెగా స్టార్ ఆశీస్సులతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బన్నీ… ఇప్పుడు తన స్టైల్, డాన్స్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్ కూడా తన డాన్స్ కు ఫిదా అయి… హిందీలో ఒక్క సినిమా అయినా చేయాలని కోరుతుంటే అతిశయోక్తి కాదు. అయితే బుధవారం పుట్టినరోజు జరుపుకుంటున్న బన్నీకి తనదైన స్టైల్ లో శుభాకాంక్షలు తెలిపాడు చిరు. బన్నీ చిన్నప్పుడు తన ముందు డాన్స్ చేసిన ఫోటోను షేర్ చేసిన మెగాస్టార్.. డాన్స్ లో గ్రేస్ ఆ వయస్సు నుంచే ఉంది.. బన్నీ లోని కసి, కృషి నాకు చాలా ఇష్టం… నువ్వు బాగుండాలబ్బా.. అని విష్ చేశారు.

అఖిల్ అక్కినేని పుట్టిన రోజు పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు చిరు. అఖిల్ చరణ్ కు తమ్ముడు అని… నాకు, సురేఖకు కొడుకులాంటి వాడని తెలిపిన చిరు.. మోస్ట్ ఎలజిబుల్ బ్యాచులర్, మోస్ట్ లవ్ కిడ్ అఖిల్ కు బర్త్ డే విష్ చేశాడు. నాగ్, చిరులతో కలిసి ఉన్న అఖిల్ చిన్ననాటి ఫోటోను అభిమానులతో పంచుకున్నారు చిరు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్ పుట్టిన రోజు కూడా ఏప్రిల్ 8న కావడం విశేషం. ఈ సందర్భంగా విష్ చేసిన చిరు… మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు.(6’4″) అన్ని విషయాల్లో కూడా అందరిని ఇలానే మించిపోవాలని కోరుకుంటున్నానని అన్నారు. అకిరాకు పవర్ ఫుల్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.


Tags: Megastar, Chiranjeevi, Allu Arjun, Akhil Akkineni, Akiranandan

Advertisement

Next Story