- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిరు ఆలోచన.. ఆత్మకథ వైపుగా..
దిశ, వెబ్‌డెస్క్: కొణిదెల శివశంకర వరప్రసాద్… మెగాస్టార్‌గా ఎదిగిన తీరు అనిర్వచనీయం. పునాది రాళ్లు సినిమాతో సినీరంగంలో గట్టి పునాది వేసుకున్న చిరు.. స్వయం కృషితో మెగాస్టార్‌గా జేజేలు అందుకున్నారు. చిరు డైలాగ్ చెప్తే థియేటర్ మారుమోగాల్సిందే… ఆ లుక్‌కు బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే… స్టెప్ వేస్తే సినిమా హాల్‌లో పేపర్లు ఎగరాల్సిందే…. అన్నయ్యా వన్స్‌మోర్ అనాల్సిందే. చిరు స్టైల్, స్వాగ్, గ్రేస్ అలాంటిది మరి. ఎన్నటికి తరగని అభిమానాన్ని సొంతం చేసుకుని ఆరుపదుల వయస్సులోనూ అదే గ్రేస్, అదే ఊపు కంటిన్యూ చేస్తున్న మెగాస్టార్ తన ఆత్మకథను రాయబోతున్నారట. కష్టే ఫలి సిద్ధాంతాన్ని నమ్ముకున్న చిరు.. తన జీవిత కథతో మరింత మందిలో స్ఫూర్తిని రగిలించే దిశగా అడుగులు వేస్తున్నారట. శ్రమ, కృషి, పట్టుదలతో తను ఎదిగిన తీరును అభిమానులకు పుస్తకరూపంలో అందించబోతున్నారట.
కొంచెం కొత్తగా ట్రై చేస్తే… జీరో హీరో అవుతాడు. నంబర్ వన్ రేంజ్‌కు దూసుకుపోతాడు. అదే చేశాడు చిరు. అప్పటి వరకున్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ లాంటి హీరోలు తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్న తరుణంలో ఎంట్రీ ఇచ్చిన చిరు… అప్పటి వరకు ప్రేక్షకులు చూడని డ్యాన్స్ అనే గొప్ప అస్త్రాన్ని వదిలాడు. నటనతో పాటు తన స్టెప్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా కష్టపడ్డాడు. ఆ కష్టం ఫలించింది. సక్సెస్ సొంతమైంది. జీరో… సుప్రీం హీరో అయ్యాడు.. మెగాస్టార్‌గా మన్ననలు పొందాడు. ఆ తర్వాత ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన చిరు… తన దారి ఇది కాదని… సినీ కళామతల్లి ఒడినే చేరాడు. ‘ఖైదీ నం. 150’తో రీ ఎంట్రీ ఇచ్చి… తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ‘సైరా’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన చిరు.. ‘ఆచార్య’గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే తన జీవిత కథను రాసేందుకు ఆసక్తి ఉన్నా… టైమ్ లేకపోవడంతో ఇన్నాళ్లు అటు వైపుగా ప్రయత్నించలేదట చిరు. లాక్ డౌన్ సమయం కలిసి రావడంతో.. ఆత్మకథకు రూపమిచ్చేందుకు ఈ సమయాన్ని కేటాయిస్తున్నారట. సినీ జీవితాన్ని మొదలు పెట్టే ముందు నుంచి… కెరియర్ స్టార్టింగ్‌లో ఎదుర్కొన్న అనుభవాల సారాన్ని పుస్తకంలో పొందుపరచనున్నారట. ప్రస్తుతం ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆడియో రికార్డ్ చేస్తున్న చిరు… ఓ మంచి రచయితకు ఈ రికార్డు అందించి పుస్తకాన్ని రచింపజేసే యోచనలో ఉన్నారని సమాచారం. అంటే త్వరలోనే కొణిదెల చిరంజీవి ఆత్మకథ మనముందుకు రాబోతుందన్న మాట. ఈ వార్తతో మెగా ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. అన్నయ్య ఆటో బయోగ్రఫీ వస్తుందని సంబురపడుతున్నారు.
Tags: Chiranjeevi, Mega Star, Konidela Chiranjeevi, Tollywood