ఆ సెల్యూట్‌లో ప్రేమ, గర్వం చూసాను : మెగాస్టార్

by Anukaran |   ( Updated:2021-01-05 09:28:19.0  )
ఆ సెల్యూట్‌లో ప్రేమ, గర్వం చూసాను : మెగాస్టార్
X

దిశ, వెబ్‌డెస్క్: కన్న కూతురికి ‘నమస్తే మేడమ్’ అంటూ సెల్యూట్ చేసిన పోలీస్ తండ్రి రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గుంటూరు అర్బన్ సౌత్ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి, తిరుపతిలో సర్కిల్‌ ఇన్ స్పెక్టర్‌గా పని చేస్తున్న శ్యామ్ సుందర్‌లు ఆదివారం డ్యూటీ‌‌మీట్‌లో భాగంగా ఒకేచోట కలిసారు. దీంతో ఒకేచోట తనకంటే కూతురును పైస్థాయిలో చూసిన తండ్రి శ్యామ్ సుందర్ ఆనందంతో సెల్యూట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలను చూసిన అందరూ శభాశ్ అంటూ అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా వీరి గురించి తెలిసిన మెగస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘తన గుండెలమీద ఎత్తుకుని పెంచిన బిడ్డ, తన పైఅధికారిగా వచ్చినప్పుడు ఆ తండ్రి చేసిన సెల్యూట్‌లో బోలెడంత సంతృప్తి ఉంది. ఆ సెల్యూట్‌లో గర్వాన్ని, ప్రేమను చూసాను. పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎంచుకొని ప్రజలకు సేవ చేయాలని చూస్తున్న మీ తండ్రీకూతుళ్లిద్దరూ ఎందరికో స్ఫూర్తి’’ అని చిరంజీవి ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు.

Advertisement

Next Story