నేడు, రేపు జేఎన్టీయూలో మెగా జాబ్​ఫెయిర్

by Shyam |   ( Updated:2021-12-17 10:56:27.0  )
నేడు, రేపు జేఎన్టీయూలో మెగా జాబ్​ఫెయిర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: జేఎన్టీయూలో గోల్డెన్ ​జూబ్లీ వేడుకల్లో భాగంగా శని, ఆదివారాల్లో మెగా జాబ్​ఫెయిర్​ను నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఈ జాబ్​మేళాను గవర్నర్ ​తమిళిసై ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. దాదాపు 120 కంపెనీలు, 10 వేలకు పైగా ఉద్యోగాల నియామకానికి ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. 2012 నుంచి ఇప్పటి వరకు పాసవుట్​ అయిన పదో తరగతి, ఇంటర్, అన్ని డిగ్రీ, పీజీ విద్యార్థులు అర్హులని, ఆసక్తికలవారు మేళాలో పాల్గొనాలని వర్సిటీ అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story