- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రైవేటు రైలు సర్వీసు రంగంలోకి 'మెగా'
దిశ, తెలంగాణ బ్యూరో: రైలు సర్వీసుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా రైల్వే మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ మేరకు మొత్తం పదిహేను సంస్థల నుంచి 120కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఊహించినదానికంటే మంచి స్పందన వచ్చిందని రైల్వే శాఖ సంతృప్తి వ్యక్తం చేసింది. దరఖాస్తు చేసుకున్న పదిహేను సంస్థల్లో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన ‘మెగా’ (మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్) సంస్థ కూడా ఉంది. మొత్తం పన్నెండు క్లస్టర్లలో సుమారు 140గమ్యస్థానాలకు రైలు సర్వీసులు నడపడానికి ఈ నోటిఫికేషన్ జారీ చేశామని రైల్వే శాఖ పేర్కొంది.
ఈ రూట్లలో మొత్తం 151 ఆధునిక రైలు సర్వీసులను ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో నడపాలన్నది లక్ష్యమని రైల్వే శాఖ పేర్కొంది. రెండు దశల్లో పారదర్శకంగా జరిగే ఎంపిక ప్రక్రియలో అర్హత సాధించిన సంస్థలకు అప్పగించనున్నట్లు పేర్కొంది. వచ్చే నెలకల్లా ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఆ సంస్థలకు రైలు సర్వీసులను నిర్వహించుకునే బాధ్యతలను అప్పజెప్పనున్నట్లు పేర్కొంది. మొత్తం పన్నెండు క్లస్టర్లలో సికింద్రాబాద్‌కు పది, చెన్నయ్‌కు తొమ్మిది, బెంగుళూరుకు 11, ఢిల్లీకి 22, ముంబాయికి 21 చొప్పున ఉన్నాయి.