అసెంబ్లీలో సీఎంతో ఈటల భేటీ

by Shyam |   ( Updated:2020-03-16 07:08:43.0  )
అసెంబ్లీలో సీఎంతో ఈటల భేటీ
X

అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు, పాజిటివ్ వచ్చిన వారికి అందిస్తున్న చికిత్స వివరాలు, ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలు ముఖ్యమంత్రికి ఈటల వివరించారు. తక్షణమే అవసరమైన వస్తువులను ఇప్పటికే కొనుగోలు చేసినట్టు తెలిపారు. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన క్వారెంటెన్ ఫెసిలిటీస్‌పై వివరాలు తెలియజేశారు. సీఎం ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ప్రొక్యూర్‌మెంట్ కమిటీ హెడ్ ఐఏఎస్ అధికారి శ్రీదేవి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు, tsmidc ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, గాంధీ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రవన్‌తో ఈటల ఫోన్లో మాట్లాటారు. ఐసొలేషన్ వార్డుల్లో ఉపయోగించే అన్ని రకాల అత్యవసరమైన వస్తువులు కొనుగోలు చేయాలని సూచించారు. అన్ని పీహెచ్‌సీలకు టెండర్లు లేకుండా అన్ని రకాల వస్తువులు కొనుగోలు చేయాలని, మార్కెట్లో కంటే అతి తక్కువ ధరతో, నాణ్యమైన వాటిని కొనుగోలు చేయాలని ప్రొక్యూర్‌మెంట్ చైర్మన్ శ్రీదేవినీ, టీఎస్ఎంఐడీసీ ఎండి చంద్రశేఖర్ రెడ్డిని కోరారు. గాంధీ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డు దగ్గరికి సాధారణ వ్యక్తులు ఎవరూ వెళ్లకుండా దారులు మూసి వేయాలని, ఐశోలేషను వార్డుల్లో పనిచేయడానికి మూడు షిఫ్టుల్లో సరిపోయేంత సిబ్బంది, వారికి కావాల్సిన వ్యక్తిగత భద్రత కిట్స్, శానిటైజర్స్, మాస్క్‌లు అందించాలని, పేషంట్లకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, బాత్రూంలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, మంచి భోజనం అందించాలని సూచించారు. గచ్చిబౌలిలో ఏర్పాటు చేస్తున్న క్వారెంటైన్ రూమ్స్‌ను వెంటనే అందుబాటులోకి వచ్చేలా చూడాలని కోరారు. విమానాశ్రయంలో ఒక్క మనిషి కూడా తప్పిపోకుండా ప్రతి ఒక్కరినీ స్క్రీన్ చేసి లక్షణాలు ఉన్న వారిని హాస్పిటల్‌కి తరలించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కరు కూడా మిస్ కావద్దని చెప్పారు.

Tags : Meeting, CM KCR, minister etala rajendar, assembly, Health Indications, Medical Equipment, ALL Hospitals

Advertisement

Next Story

Most Viewed