- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జైపూర్ టు జెనీవా.. ఓ ఆటోవాలా ప్రేమకథ!
దిశ, ఫీచర్స్: వెండితెరపై ప్రదర్శించే ‘ప్రేమ’ కథలన్ని చివరకు సక్సెస్ సాధిస్తూనే ఉంటాయి. కాని రియల్ లైఫ్‌లో విజయం సాధించిన ప్రేమకథలు మాత్రం అరుదు. అయితే తన ప్రేమను దక్కించుకోవడంతో పాటు, కెరీర్‌ను కూడా అందంగా తీర్చిదిద్దుకుని, ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్న ఓ ఆటో డ్రైవర్.. జైపూర్‌లోని మురికివాడల నుంచి జెనీవాలోని మంచుదారుల వరకు సాగిన ఇంట్రెస్టింగ్ లవ్‌స్టోరీ మీ కోసం.
జైపూర్‌కు చెందిన రంజిత్ సింగ్ రాజ్‌కు చిన్నప్పటి నుంచి చదువుపై పెద్దగా ఆసక్తి లేదు. కానీ అతడి తల్లిదండ్రులు మాత్రం కొడుకు ఉన్నతస్థాయిలో ఉండాలనే ఆశతో బడికి పంపించారు. రంజిత్ పదో తరగతి ఫెయిలై 16 ఏళ్ల వయస్సులోనే ఆటోరిక్షా నడపడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే జైపూర్‌కు వస్తున్న విదేశీ ప్రయాణికులతో చక్కగా సంభాషించే రంజిత్, వారి భాషలను నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అలా ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో పట్టు సాధించిన రంజిత్, విదేశీ పర్యాటకులను తన భాషా ప్రావీణ్యంతో ఆకట్టుకున్నాడు. విదేశీయులు ఎవరూ వచ్చిన రంజిత్‌ను తమ గైడ్‌గా పెట్టుకునేవాళ్లు. అలా ఒకరోజు స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ అమ్మాయి తన స్నేహితులతో ఇండియా పర్యటించడానికి జైపూర్ వచ్చింది. రంజిత్‌ను ఆమె ట్రావెల్ గైడ్‌గా నియమించుకుంది. సినిమాల్లో చూసినట్లు, పర్యటన అయిపోయేలోగా వాళ్లిద్దరు ప్రేమలో పడ్డారు.
మేము మొదట సిటీ ప్యాలెస్‌లో కలుసుకున్నాం. పర్యటనలో ఇద్దరం కలిసి చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్లం. అదే సమయంలో ఒకరినొకరు ఇష్టపడ్డం. ఆమె ఫ్రాన్స్‌కు తిరిగి వెళ్లిన తరువాత, స్కైప్ ద్వారా కనెక్ట్ అయ్యాము. ఆమెను కలిసేందుకు ఫ్రాన్స్ వెళ్ళడానికి అనేక ప్రయత్నాలు చేశాను. కాని వీసా దరఖాస్తు తిరస్కరించడంతో, తనే ఇండియా వచ్చి ఎంబసీలో మాట్లాడి ఫ్రాన్స్ వెళ్ళడానికి మూడు నెలల టూరిస్ట్ వీసా ఇప్పించింది. ఆ తర్వాత చాలాసార్లు ఫ్రాన్స్‌కు వెళ్లగా, 2014లో మేము వివాహం చేసుకున్నాం. ఆ తర్వాత న్యూ ఢిల్లీలోని ది అలయన్స్ ఫ్రాన్స్‌లో ఫ్రెంచ్ క్లాసులకు హాజరై, సర్టిఫికేట్ పొందాను. ఇది నాకు దీర్ఘకాలిక వీసా పొందడానికి సహాయపడింది. మాకు ప్రస్తుతం ఓ బాబు ఉన్నాడు’ అని రంజిత్ తెలిపాడు.
ప్రస్తుతం జెనీవాలో నివసిస్తున్న రంజిత్ ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడు. ఇటీవలే యూట్యూబ్ చానల్ ప్రారంభించి యూట్యూబర్‌గా మారాడు. భవిష్యత్తులో తన సొంత రెస్టారెంట్‌ను ప్రారంభించాలని కలలు కంటున్నాడు.