- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గ్రామీ నామినేషన్స్‌లో సింగర్ ప్రియదర్శిని
దిశ, వెబ్‌డెస్క్ : సంగీత ప్రపంచంలో ప్రతిభకు పట్టంకట్టే అత్యున్నతమైన అవార్డ్స్ ‘గ్రామీ పురస్కారాలు’. 63వ గ్రామీ అవార్డ్స్ 31 జనవరి, 2021న లాస్ ఏంజిల్స్‌లో జరగనున్నాయి. కాగా ఈ ఏడాది గ్రామీ పురస్కారాల నామినేషన్స్‌ను ఇటీవలే రివీల్ చేయగా, బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ కేటగిరీలో భారత సంతతి యువతి, సింగర్ ప్రియదర్శిని ఎంపికైంది. బియాన్స్, టేలర్ స్విఫ్ట్, అరియానా గ్రాండే, జస్టిన్ బీబర్, బిల్లీ ఇలిష్.. ఇలా ప్రముఖ సింగర్స్ అందరూ ట్రోఫి గెలిచి తమ గ్రామీని ఇంటికి తీసుకెళ్లేందుకు రెడీగా ఉన్నారు. వారితో పాటు మన ముంబై యువతి ప్రియదర్శిని తొలిసారి తన అదృష్టాన్ని పరిష్కరించుకోనుంది.
న్యూయార్క్‌లో నివాసముండే ముంబైకు చెందిన 37 ఏళ్ల ప్రియదర్శిని.. తన తొలి ఆల్బమ్‌గా ‘పెరిఫెరి’ని సంగీతప్రియుల ముందుకు తీసుకొచ్చింది. తన ఈ డెబ్యూ ఆల్బమ్ ఇంత పెద్ద సక్సెస్ కావడమే కాకుండా తనను గ్రామీ నామినేషన్స్‌కు ఎంపిక చేయడం విశేషం. కాగా ఈ ఆల్బమ్‌లోని పాటలు ట్రెడిషనల్ కర్ణాటిక్ మ్యూజిక్, అమెరికన్ పాప్ రెండింటి కలయికగా రూపొందించబడ్డాయి. ఇక గురుగావ్‌లో పుట్టిన ప్రియదర్శిని క్లాసికల్ మ్యూజిక్‌లో ట్రైనింగ్ తీసుకుంది. క్రాస్-కల్చరల్ మ్యూజిక్‌ను అమితంగా ఇష్టపడే తను కేవలం సింగర్ మాత్రమే కాదు.. నటి, అథ్లెట్, ఎంటర్‌ప్రెన్యూర్ కూడా. సింగింగ్‌తో పాటు ఇప్పటికే కొన్ని వందల సంఖ్యలో వాయిస్ ఓవర్స్ అందించింది.
‘స్వచ్ఛమైన మనిషి భావోద్వేగమే ‘సంగీతం’. నేను పెరిఫెరి పాటలను 12 రోజుల్లో రచించి, రికార్డింగ్ చేశాను. బ్రూక్లిన్‌లోని గ్రీన్‌పాయింట్ చర్చిలో వీటిని రికార్డ్ చేశాను. నేను ఫెమినిస్ట్ పర్‌సెప్షన్‌లో సంగీతమందిస్తాను. ప్రపంచ నలుమూల నుంచి వచ్చిన సంగీతం.. మనలో ఊహాత్మకమైన, మనోహరమైన భావాలను మేల్కొలుపుతుంది. దాంతో మరో కొత్త సంగీతం మనలోంచి ఉద్భవిస్తుంది. మా గ్రాండ్ మదర్ నుంచే నాకు క్లాసికల్ మ్యూజిక్ మీద ఇష్టం పెరిగింది. ఆమె భరతనాట్యం డ్యాన్సర్, క్లాసికల్ వోకలిస్ట్. ఆమె పేరు కూడా ప్రియ దర్శిని’ అని ప్రియ చెప్పుకొచ్చింది.
ప్రియ ఇప్పటికే టీవీ, రేడియో కార్యక్రమాల కోసం సంగీతమందించడంతో పాటు ఇండియన్ మూవీస్‌కు కూడా పనిచేసింది. అంతేకాదు తన మ్యూజిక్ జర్నీలో.. ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిషియన్స్ పియర్ల్ జామ్, రాయ్ వూటెన్, జెఫ్ కొఫిన్, ఫిలిప్ లాసిస్టర్‌లతో కలిసి పనిచేసింది. మదర్ థెరిస్సా జీవితం ఆధారంగా వచ్చిన చిత్రం ‘ద లెటర్స్’ సినిమాతో నటిగా మారిన ప్రియ.. అందులో సుభాషిని దాస్‌గా కనిపించి మెప్పించింది. అంతేకాదు ‘జన రక్షిత’ పేరుతో ఓ ఎన్‌జీవోను కూడా నడుపుతోంది. కేన్సర్ చిన్నారులకు, ఇతర వ్యాధులతో బాధపడే పిల్లల చికిత్సకు అయ్యే ఖర్చును ఈ స్వచ్ఛంద సంస్థ వారే సమకూరుస్తున్నారు.