చీర కట్టుకుంటే.. ఆ హోటల్‌లోకి నో ఎంట్రీ!

by Shyam |
చీర కట్టుకుంటే.. ఆ హోటల్‌లోకి నో ఎంట్రీ!
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ మీరా చోప్రా ఢిల్లీలోని అక్విలా రెస్టారెంట్‌పై ఫైర్ అయింది. చీర కట్టుకుందని మహిళను రెస్టారెంట్ లోపలికి అనుమతించకపోవడం ఇండియన్ కల్చర్‌పై డైరెక్ట్ అటాక్‌ అని తెలిపిన ఆమె.. చీర ధరించడం స్మార్ట్ క్లాథింగ్ కాదా? అని ప్రశ్నించింది. భారతీయ సాంప్రదాయాలను తక్కువ చేస్తున్న ఇలాంటి ప్లేసెస్‌ను బాయ్‌కాట్ చేద్దామని పిలుపునిచ్చింది. అలాంటి రెస్టారెంట్లను వెంటనే మూసేయాలని డిమాండ్ చేసింది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పటికే వైరల్ కాగా.. రెస్టారెంట్ లైసెన్స్ వెంటనే క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story