కరోనా వైరస్‌కు ఔషధం సిద్ధమైంది!

by vinod kumar |
కరోనా వైరస్‌కు ఔషధం సిద్ధమైంది!
X

దిశ, సెంట్రల్ డెస్క్: ప్రపంచ దేశాలను ఊపిరాడకుండా చేస్తోన్న కరోనా మహమ్మారి నివారణకు ఔషధం సిద్ధమైంది. ముంబైకి చెందిన గ్లెన్ మార్క్ సంస్థ ఈ మందును తీసుకొచ్చింది. ఫాబిఫ్లూ బ్రాండ్ పేరిట తీసుకొచ్చిన ఈ టాబ్లెట్‌కు ఐసీఎంఆర్ కూడా ఆమోదం తెలపడం గమనార్హం. త్వరలోనే ఈ టాబ్లెట్లను మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అవడంతో భారత ఔషద నియంత్రణ సంస్థ నుంచి ఆమోదం పొందింది.

కరోనా వ్యాధి సొకిన వారు తొలిరోజు 1800 ఎంజీ టాబ్లెట్లను రెండు సార్లు తీసుకోవాలని.. తర్వాత 14 రోజుల వరకు 800 ఎంజీ టాబ్లెట్లను కూడా రోజుకు రెండు సార్లు తీసుకోవాలని సూచించింది. షుగర్, హార్ట్ ఎటాక్ సమస్యలు ఉన్నవారు కూడా ఈ ఔషధాన్ని వాడవచ్చు. కాగా, ఒక్క టాబ్లెట్ ధర రూ. 103 రూపాయలు ఉంటుందని గ్లెన్ మార్క్ ఛైర్మన్ గ్లెన్ సల్దన్హా వెల్లడించారు. వైద్యుల ప్రిస్ర్కిప్షన్ ఆధారంగా టాబ్లెట్లను విక్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed