వారిని ఆన్ డ్యూటీ కింద పరిగణిస్తాం : ఈటల

by Shyam |   ( Updated:2020-08-27 10:45:46.0  )
వారిని ఆన్ డ్యూటీ కింద పరిగణిస్తాం : ఈటల
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న విషయం తెలిసిందే. దీంతో రోజురోజుకూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతూ, ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ క్రమంలో ఆసుపత్రుల్లో సరైన వసతులు కల్పించాలని రోజూ ఎక్కడో చోట వైద్య సిబ్బంది ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా డాక్టర్స్, పారామెడికల్ సంఘాలు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై గురువారం మంత్రి ఈటల రాజేందర్ సానుకూలంగా స్పందించారు.

మంత్రి హామీతో ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. కరోనాతో చనిపోయిన వైద్య సిబ్బందికి ఎక్స్‌గ్రేషియాపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఢిల్లీ, మహారాష్ట్ర, ఒడిశాల్లో విధానాలను పరిశీలించి తుది నిర్ణయం ప్రకటిస్తామని ఈటల హామీ ఇచ్చారు. డాక్టర్లకు, హెల్త్ కేర్ సిబ్బందికి నిమ్స్, గాంధీ ఆస్పత్రుల్లో.. చికిత్స కోసం ప్రభుత్వం జీవో ఇస్తుందని పేర్కొన్నారు. కరోనా వచ్చి లీవ్‌లో ఉన్న వాళ్లను ఆన్‌డ్యూటీ కింద పరిగణిస్తామని ఈటల రాజేందర్ ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed