- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డాక్టర్లు.. కరోనా బాధితులకు మధ్య మెడిబోట్
దిశ వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి ముట్టుకుంటే.. వచ్చేస్తూ అందరినీ భయపెడుతోంది. తుమ్మినా, దగ్గినా, కరోనా బాధితులను తాకినా.. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మాయరోగానికి డాక్టర్లు కూడా బలవుతున్నారు. నిత్యం కరోనా సోకిన బాధితుల మధ్యలో తిరిగే డాక్టర్లు కూడా కరోనా బారిన పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే డాక్టర్లు బాధితుని దగ్గరకు వెళ్లకుండానే.. ట్రీట్ చేస్తే .. బాగుంటుంది కదూ! మలేషియాలోని కొందరు శాస్త్రవేత్తలు అందుకోసం ఓ రోబోను రూపొందించారు. అదే మెడిబోట్.
కరోనా పోరులో కుటుంబాలకు దూరంగా ఉండటమే కాకుండా, తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా శ్రమిస్తున్నారు డాక్టర్లు. కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసేందుకు డాక్టర్లు, నర్సులు ఎంతో శ్రమిస్తున్నారు. పీపీఈలు వాడుతున్నా, మాస్క్ లు బిగించుకున్నా… ఏదో విధంగా కరోనా మహమ్మారి డాక్టర్లు, నర్సులకు సోకుతోంది. ప్రజల కోసం ఆలోచిస్తున్న డాక్టర్ల కోసం, కరోనా పేషెంట్ల నడుమ తిరుగుతున్న వైద్య బృందాల కోసం ‘మెడిబోట్’ ను రూపొందించారు మలేషియాలోని ఇంటర్నేషనల్ ఇస్లామిక్ వర్సిటీ సైంటిస్టులు తయారు చేశారు. డాక్టర్లు పేషెంట్ల దగ్గరకు వెళ్లకుండానే సేవలందించేలా ‘మెడిబోట్ ’ రోబోను తయారు చేశారు. బ్యారెల్ ఆకారంలో ఐదడుగులు ఎత్తు ఉండే ఈ రోబోట్‌లో కెమెరా, స్క్రీన్ ల ద్వారా డాక్టర్లు.. పేషెంట్లతో మాట్లాడవచ్చని, రిమోట్ ద్వారా పేషెంట్ టెంపరేచర్‌ను కూడా చెక్ చేయవచ్చిన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ రోబోట్‌ను రూపొందించేందుకు3,500 డాలర్లు ఖర్చయిందని, తొలుత వర్సిటీ ఆస్పత్రిలో రోబోట్‌ను పరీక్షించిన తర్వాత మలేసియాలోని ప్రభుత్వ ఆస్పత్రులకు అందజేస్తామని చెప్తున్నారు. కరోనా వైరస్ పోరులో థాయ్ లాండ్ , ఇజ్రాయిల్ దేశాల్లో రోబోలు వినియోగిస్తున్నారు. ఇదిలా ఉండగా మలేషియా లో కరోనా వైరస్ కారణంగా 76 మంది చనిపోగా, 4683 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
tags :coronavirus, doctors, medibot, malaysia, international islamic university scientists