కరోనా సోకిన జర్నలిస్టులను ఆదుకుంటాం: అల్లం నారాయణ

by Shyam |

దిశ, మహబూబ్‌నగర్: కరోనా సోకిన జర్నలిస్టులను అన్నిరకాలుగా ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో మీడియా కవరేజ్ కోసం వెళ్లిన కొంత మంది తెలంగాణ జర్నలిస్టులు ఈ వైరస్ బారిన పడ్డారని, వారికి మీడియా అకాడమీ తరఫున ఆర్థిక సాయం అందజేయనున్నట్టు మంగళవారం ప్రకటించారు. న్యూఢిల్లీలో ముగ్గురు, గద్వాల జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్ రాగా, ఒక్కొక్కరికి రూ. 20 వేల చొప్పున అందిస్తామన్నారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదుగురు, గద్వాల జిల్లాలో నలుగురు జర్నలిస్టులు హోం క్వారంటైన్‌లో ఉన్నారన్నారు. వీరికి రూ. 10 వేల చొప్పున రూ. 90 వేల ఆర్థిక సాయం చేశామన్నారు. ఈ డబ్బులను వారి బ్యాంకు ఖతాల్లో జమ చేశామన్నారు. సమాజహితం కోసం జర్నలిస్టులు పనిచేయాలంటే ముందు వారు ఆరోగ్యంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలని, సమాజం కంటే ముందు మనపై ఆధారపడిన కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచించాలని అల్లం నారాయణ సూచించారు.

Tags: corona positive, journalist, media academy chairman allam narayana, donation

Advertisement

Next Story

Most Viewed