- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్ -19పై మేడ్చల్ కలెక్టర్ సమీక్ష
దిశ, హైదరాబాద్ :
జిల్లాలో వైద్యారోగ్య, పారిశుధ్య, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేస్తూ కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కృషి చేయాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. కొవిడ్-19 దృష్ట్యా జిల్లాలోని కంటైన్మెంట్ జోన్లలో తీసుకుంటున్నచర్యలపై అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానిత కేసుల గుర్తింపు, నమూనాల సేకరణ, పాజిటివ్ కేసుల నిర్ధారణ, ప్రాథమిక కాంటాక్ట్స్‌పై ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు, వైద్య సిబ్బందికి సహాయం చేస్తున్న ఇతర శాఖలకు చెందిన సిబ్బంది పనితీరును వివరంగా తెలుసుకున్నారు. జిల్లా స్థాయి ముఖ్యమైన వైద్యాధికారులతో ప్రతిరోజు సాయంత్రం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు.
క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వైద్య, ఆరోగ్య, పారిశుధ్య, పోలీస్, రెవెన్యూ సిబ్బందిని ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. మేడ్చల్ జిల్లాను కరోనా లేని జిల్లా రూపొందించాలని ఆకాంక్షించారు. అంతకు ముందు కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు.. నిజాంపేట మున్సిపాలిటీ కంటైన్మెంట్ జోన్‌లో పర్యటించి, అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. టెలీకాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ విద్యాసాగర్, డీఆర్వో మధుకర్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి వీరాంజనేయులు పాల్గొన్నారు.
Tags: Covid 19, Medchal collector, Teleconference, Containment Zones