పాసులు దుర్వినియోగిస్తే చర్యలు : ఎస్పీ చందనా దీప్తి

by Shyam |
పాసులు దుర్వినియోగిస్తే చర్యలు : ఎస్పీ చందనా దీప్తి
X

దిశ, మెదక్:
లాక్‌డౌన్ నేపథ్యంలో అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప పాసులు ఉపయోగించకూడదని, ఎవరైనా పాసుల దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా ఎస్పీ చందనా దీప్తి అన్నారు. మంగళవారం జిల్లాలోని ఎస్పీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలకు పాసులు జారీ చేస్తామన్నారు. ఎవరైనా స్వార్థం కోసం తమను ఆశ్రయించి తప్పుడు పత్రాలు సమర్పిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా కట్టడి కోసం తీసుకునే చర్యలను ఎవరూ కూడా దుర్వినియోగం చేయరాదని, ప్రజల శ్రేయస్సు కోసమే పోలీసులు నిర్విరామంగా పని చేస్తున్నారని తెలిపారు. కరోనా కట్టడికి కృషి చేస్తున్న జిల్లా పోలీసు యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.

Tags: Medak, SP Chandana Deepthi, media meeting, SP Office, lockdown passes

Advertisement

Next Story

Most Viewed