మెదక్: యాసిడ్ బాధితురాలు మృతి

by Sumithra |
acid victim
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మెదక్ జిల్లాలో ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగిన విషయం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తి మహిళపై యాసిడ్‌తో దాడి చేసి పరారయ్యాడు. బాధితురాలికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. మంగళవారం తెల్లవారుజామున మృతిచెందింది. కాగా, ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు యాసిడ్ దాడిచేసిన నిందితుల కోసం గాలిస్తున్నారు. దీంతో బాధితురాలు టేక్మాల్‌ మండలం మార్కాపూర్ తండాలో విషాయచాయలు అలుముకున్నాయి. అయితే ఆమెపై యాసిడ్ దాడి ఎవరు చేశారు. ఎందుకు చేశారు అనే విషయాలు ఇంకా తెలియ రాలేదు.

Advertisement

Next Story