- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్లమెంటరీ కమిటీ సమావేశాల నిర్వహణకు నిబంధనలు
న్యూఢిల్లీ: పార్లమెంటరీ కమిటీ సమావేశాల నిర్వహణలో కరోనా కట్టడి నిబంధనలు పకడ్బందీగా అమలుకానున్నాయి. రాజ్యసభ సెక్రెటేరియట్ నిర్వహించే పార్లమెంటరీ కమిటీలో పాల్గొనే సభ్యుల మధ్య కనీసం 6 అడుగుల దూరాన్ని పాటించాల్సిందేనని ఉత్తర్వులు విడుదలయ్యాయి. కమిటీ రూంలో ఒక టేబుల్ చుట్టూ సభ్యులు కూర్చునే కుర్చీలు ఆరు అడుగుల దూరానికి తగినట్టుగా ఏర్పాటు చేస్తారు. ఆలస్యంగా వచ్చిన సభ్యులకూ అదే దూరంలో కుర్చీని వేస్తారు. ఈ కమిటీ ముందు హాజరవుతున్న శాఖ అధికారులు ఇద్దరి కంటే ఎక్కువ మంది రావొద్దు. ఒకసారికి ఇద్దరు అధికారులే వెళ్లాలి. ఆధారాలు లేదా ఇతర డాక్యుమెంట్లు ఏవైనా సాఫ్ట్ కాపీల్లోనే ఇచ్చిపుచ్చుకోవాలి. ముందుగానే మీటింగ్‌లో పాల్గొంటున్న సభ్యుల వివరాలను కమిటీ సెక్షన్ సేకరించుకోవాలి. తద్వారా తగిన ఏర్పాట్లు సులువుగా చేయవచ్చునని ఉత్తర్వులు వెల్లడించాయి. వీటితోపాటు పలు జాగ్రత్తలు ఉత్తర్వులు పేర్కొన్నాయి.