షెల్డర్ హోంను సందర్శించిన మేయర్

by Shyam |
షెల్డర్ హోంను సందర్శించిన మేయర్
X

దిశ, న్యూస్ బ్యూరో : లాక్‌డౌన్ నేపథ్యంలో న‌గ‌రంలో ఉండిపోయిన వలస కార్మికులతో పాటు నిర్వాసితులు, అనాథ‌ల‌కు జీహెచ్‌ఎంసీ ఆధ్వ‌ర్యంలో భోజ‌న వ‌స‌తులు క‌ల్పించిన‌ట్లు మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ తెలిపారు. గురువారం బ‌న్సీలాల్‌పేట మ‌ల్టీప‌ర్ప‌స్ క‌మ్యునిటీ హాల్‌లో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన షెల్ట‌ర్ హోంను మేయ‌ర్ సందర్శించారు. రెండొందల మందికి రెండుపూట‌ల భోజ‌నంతో పాటు మాస్క్‌లు, శానిటైజ‌ర్లు అందించి వైద్య సేవ‌ల‌ను అందుబాటులో ఉంచిన‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్-1994 బ్యాచ్‌కు చెందిన వారు అందించిన వెజ్ బిర్యానీ ప్యాకెట్లు, మాస్క్‌ల‌ను వ‌ల‌స కార్మికుల‌కు అందజేశారు. లాక్‌డౌన్ ముగిసేవ‌ర‌కు దాత‌లు త‌మ స‌హ‌కారాన్ని ఇదేవిధంగా కొన‌సాగించాల‌ని మేయ‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ సతీమణి శ్రీదేవి యాదవ్, కార్పొరేట‌ర్ హేమ‌ల‌త‌, సామాజిక కార్యకర్త డేగ హరీష్ పాల్గొన్నారు.

Tags: Lockdown, GHMC, Mayor, Social service

Advertisement

Next Story