మేయర్ పీఠం ఆ రెండు పార్టీలది కాదు..!

by Anukaran |
మేయర్ పీఠం ఆ రెండు పార్టీలది కాదు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బల్దియా ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికైతే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కేటట్లుగా కనిపించడం లేదు. ఫలితాల సరళి హంగ్​ దిశగా అడుగులు వేస్తోంది. అధికార పార్టీ కూడా మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం కష్టమేనని స్పష్టమైంది. ఇప్పటి ఫలితాల ప్రకారం టీఆర్ఎస్​మరో పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనివార్యంగా మారనుంది. బల్దియాలో 150 కార్పొరేటర్లతో పాటు ఎక్స్అఫిషియో సభ్యుల సంఖ్య 41 కలుపుకొని మొత్తం 191 గా అంచనా. ఎంఐఎం పార్టీకి 10 మంది, బీజేపీకి ముగ్గురు వంతున ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మల్కాజిగిరి ఎంపీ రేవంత్​ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన బోడుప్పల్​ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలో ఓటు వేశారు. దాంతో బల్దియాలో ఆయనకు హక్కు లేకుండా పోయింది. దీని బట్టి మ్యాజిక్ ఫిగర్​కు చేరుకోవాలంటే టీఆర్ఎస్​96 మంది సభ్యులు ఉండాలి. అంటే వారికి ఎక్స్​అఫిషియో సభ్యుల సంఖ్య 28 వరకు ఉంది. అంటే మొత్తంగా ఆ పార్టీ 68 డివిజన్లలో గెలవాలి.

ఇప్పటి ఫలితాలను బట్టి ఆ సంఖ్యలో గెలిచే ఛాన్స్ కనిపించడం లేదు. అందుకే టీఆర్ఎస్​ వర్గాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ప్రగతి భవన్​, టీఆర్ఎస్​ భవన్​ లో లెక్కలేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే ఎంఐఎం పార్టీ నేతలతో అధినేత చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మద్దతు కూడగట్టడానికి ఒప్పందాల చర్చలు తప్పనిసరిగా కనిపిస్తోంది. ఐతే నిన్న మొన్నటి వరకు ఎంఐఎం పార్టీతో తమకు ఎలాంటి పొత్తు లేదంటూ ప్రచారం చేశారు. అధికార కోసం అనివార్యంగా వారి సపోర్టు తీసుకోవాల్సి వచ్చింది. మరో వైపు మేయర్ అభ్యర్ధి ఎంపికలో టీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ బిజీగా ఉండడం గమనార్హం. ఇప్పటికే కొందరు తమకు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చిందంటూ గెలిచిన మహిళా అభ్యర్ధుల తరపు బంధువులు ప్రచారం చేస్తున్నారు.

మేయర్ కుర్చీ కోసం పది మంది వరకు పోటీ పడుతున్నారు. ఐతే కేటీఆర్ నిర్ణయం అంతిమంగా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ గతంలో మాదిరిగానే స్థానాలు గెలుచుకున్న ఎంఐఎం పార్టీ మద్దతునివ్వడానికి ఏమేం షరతులు పెడుతుందోనన్న ఆందోళన కూడా పార్టీకి పట్టుకుంది. ఏకంగా మేయర్ కుర్చీ తమకు ఇవ్వాలని అడిగే ఛాన్స్ ఉందని ప్రచారం. డిప్యూటీ మేయర్ తో సరిపెట్టుకోవాలని టీఆర్ఎస్ బేరసారాలు సాగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రెండు పార్టీల అధినేతల మధ్య అంగీకారం కుదిరితేనే హంగ్​తో బల్దియా పాలక వర్గం కొలువుదీరుతుంది.

ఎక్స్​అఫిషియో సభ్యుల వివరాలు

టీఆర్ఎస్​: ఐదుగురు రాజ్యసభ సభ్యులు, ఒక ఎంపీ, 14 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు
బీజేపీ: ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ
ఎంఐఎం: ఒక ఎంపీ, ఏడుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు

టీఆర్ఎస్​ఎక్స్​అఫిషియో సభ్యులు
ఎంపీ, రాజ్యసభ

1. కె.కేశవరావు
2. సురేష్ రెడ్డి
3. జే. సంతోష్ కుమార్
4. బడుగు లింగయ్య యాదవ్

ఎంపీ, లోక్ సభ

5. కొత్త ప్రభాకర్ రెడ్డి

ఎమ్మెల్యేలు

6. ముఠా గోపాల్
7. కాలేరు వెంకటేశం
8. దానం నాగేందర్
9. మాగంటి గోపీనాథ్
10. తలసాని శ్రీనివాస్ యాదవ్
11. పద్మారావు గౌడ్
12. సాయన్న
13. గూడెం మహిపల్ రెడ్డి
14. మైనంపల్లి హనుమంత రావు
15. మాధవరం కృష్ణారావు
16. భేతి సుభాష్ రెడ్డి
17. డి.సుధీర్ రెడ్డి
18. అరికెపూడి గాంధీ
19. స్టీఫెన్ సన్ (ఆంగ్లో ఇండియన్)

ఎమ్మెల్సీలు

20. భూపాల్ రెడ్డి
21. సతీష్ పురాణం
22. మహమూద్ అలీ
23. భాను ప్రసాద్
24. ఎమ్మెస్ ప్రభాకర్
25. నారదాసు లక్ష్మణ్ రావు
26. బసవరాజు సారయ్య
27. గోరేటి వెంకన్న
28. బుగ్గారపు దయానంద్​ గుప్తా

టీఆర్ఎస్​ లో ఎక్స్​అఫిషియో వాడుకున్నది

1. కేపీ వివేకానంద
2. సబిత ఇంద్రారెడ్డి
3. ప్రకాష్ గౌడ్
4. రంజిత్ రెడ్డి, ఎంపీ
5 శంభీపూర్ రాజు
6. కాటెపల్లి జనార్దన్ రెడ్డి
7. కసిరెడ్డి నారాయణ రెడ్డి
8. పల్లా రాజేశ్వర్ రెడ్డి
9. శ్రీనివాస్ రెడ్డి
10. రాజేశ్వర్ రావు
11. ఎగ్గే మల్లేశం
12. నవీన్ కుమార్ రావు
13. గంగాధర్
14. ఆకుల లలిత
15. కడియం
16. కర్నే ప్రభాకర్
17. ఫరీదుద్దీన్
18. ఫారూఖ్ హుస్సేన్
19. గుత్తా సుఖేందర్ రెడ్డి
20. బోడెకుంట వెంకటేశ్వర్లు
21. శేరి సుభాష్ రెడ్డి

Advertisement

Next Story

Most Viewed