మేయర్ టూర్.. ఏం పరిశీలించారంటే !

by Shyam |
మేయర్ టూర్.. ఏం పరిశీలించారంటే !
X

దిశ, న్యూస్‌బ్యూరో: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదుట జంక్షన్ అభివృద్ధి పనులను నగర మేయర్ బొంతు రామ్మోహన్ సోమవారం పరిశీలించారు. ప్రయాణికుల సౌకర్యాల కోసం తగిన వసతులు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, జoక్షన్ అభివృద్ధి వంటి విషయాలపై వివిధ విభాగాల అధికారులతో చర్చించారు. స్టేషన్‌కు వచ్చే వాహనాలకు ప్రత్యేక లైన్ల ఏర్పాటు, సాధారణ వాహనాలను మళ్లించడం వంటి విషయాలతో పాటు సెంట్రల్ మిడియన్లు, బస్ షెల్టర్ల ఆధునీకరణ, షీ- టాయిలెట్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నేతాజీ విగ్రహం చుట్టూ గ్రీనరీ పెంచి, ఫౌంటెన్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story