- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగోల్ జంక్షన్..ఇక మీదట ట్రాఫిక్ ఫ్రీ
మేయర్ బొంతు రామ్మోహన్
aదిశ, ఎల్బీనగర్ :
నాగోల్ జంక్షన్ నుంచి ఇందూ అరణ్య వరకు బండ్లగూడ రోడ్డును 120 అడుగుల వెడల్పుతో అభివృద్ధి చేయనున్నట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. గురువారం రోడ్డు విస్తరణ ప్రతిపాదనలను మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్, ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి, ఇతర అధికారులతో కలిసి మేయర్ పరిశీలించారు. రోడ్డు విస్తరణ భాగంలో ఉన్న దేవాలయం నిర్వాహకులతో మేయర్ మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి ప్రస్తుతం ఎటువంటి పనులు చేపట్టరాదని సూచించారు. రోడ్డు విస్తరణకు, దేవాలయం అభివృద్ధికి ఎటువంటి సమస్య తలెత్తకుండా చర్చించుకుని ఓ నిర్ణయానికి వద్దామని వివరించారు. రోడ్డు విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వెంటనే చేపట్టి వేగంగా పనులు పూర్తిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని ఓఆర్‌ఆర్ నుంచి ఇందూ అరణ్య వరకు రోడ్డు విస్తరణ పనులు గతంలోనే పూర్తయ్యాయి. నాగోల్ చౌరస్తా నుంచి ఉన్న మూడున్నర కిలోమీటర్ల పొడవున ప్రస్తుతం చేపడుతున్న విస్తరణతో నగరానికి బయట నుంచి వచ్చే వాహనాల రాకపోకలకు ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ప్రత్యమ్నాయ మార్గంగా ఔటర్ రింగ్ రోడ్డుకు, వరంగల్ రహదారికి, మరోవైపు విజయవాడ రహదారికి వెళ్లే వాహనదారులకు సౌకర్యంగా ఉంటుంది.