హరిత నగరంగా హైదరాబాద్

by Shyam |
హరిత నగరంగా హైదరాబాద్
X

దిశ, న్యూస్​‌బ్యూరో: హైదరాబాద్​ నగరాన్ని హరితనగరంగా తీర్చిదిద్దుతున్నట్లు మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ తెలిపారు. ఐఎస్ సదన్ మోహన్‌నగర్ కాలనీలో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన పార్కును సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మేయర్​ మాట్లాడుతూ ప్రతికాలనీలో ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించేందుకు 320పార్కులు, 50థీమ్ పార్కులు, 120జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు. రోడ్లపై ఎక్కడ‌ప‌డితే అక్కడ చెత్త వేస్తున్నవారిని గుర్తించాల‌ని శానిటేషన్ వర్కర్లకు సూచించారు. అలాగే అటువంటి వ్యక్తుల‌కు పారిశుధ్యంపై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఆదేశించారు. ఈ ప‌ర్యట‌న‌లో స్టాండింగ్ కమిటీ సభ్యురాలు సామ స్వప్న సుందర్‌రెడ్డి, జోన‌ల్ క‌మిష‌న‌ర్ అశోక్ సామ్రాట్‌, డిప్యూటీ క‌మిష‌న‌ర్ మంగ‌త‌యారు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed