వామ్మో ఇన్ని కరోనా ఫైన్లు కట్టారా..?

by Anukaran |   ( Updated:2021-10-18 22:34:04.0  )
వామ్మో ఇన్ని కరోనా ఫైన్లు కట్టారా..?
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో కరోనా నిబంధనలు పాటించకుండా ఏకంగా 40,33,798 మంది ప్రభుత్వానికి ఫైన్లు కట్టారు. 2021 అక్టోబర్ చివరి నాటికి మొత్తంగా 31,87,79,993 రూపాయలు జరిమానా రూపంలో ముట్టింది. మాస్క్ లేకుండా తిరగడం, గుంపులు గుంపులుగా కనిపించడం, షాపింగ్ పేరుతో మాస్క్ లు లేకుండా తిరగడం లాంటి అనేక కారణాల వల్ల ప్రభుత్వం ఈ ఫైన్లు వసూలు చేసింది.

వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఒక్క విశాఖలోనే 11.42 లక్షల మంది కరోనా నిబంధనలు ఉల్లంఘించారు. ఈ ఉల్లంఘన కేసులు ఎక్కువగా విశాఖలోనే నమోదు అయినా, ఫైన్లు అధికంగా కట్టింది మాత్రం చిత్తూరులోనే. ఏకంగా చిత్తూరు జిల్లా నుంచి 6.02 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. తర్వాత ప్లేస్ లో అనంతపురం జిల్లా ఉంది. ఇక్కడ కూడా దాదాపు 4.89 కోట్ల పైగానే వసూలు అయింది. రాష్ట్రంలోని గుంటూరు, శ్రీకాకుళం లలో తప్పా మిగిలిన అన్ని జిల్లాలలోనూ కోటి రూపాయల జరిమానాలు దాటాయి.

Advertisement

Next Story