- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెట్టింపు వృద్ధితో ముగిస్తాం : మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 శాతంతో రెండంకెల వృద్ధిని సాధించగలమనే నమ్మకం ఉందని ప్రైవేట్ రంగ బీమా సంస్థ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అభిప్రాయపడింది. ఈ ఏడాది మొదటి సగం కంటే రెండో సగంలో మెరుగైన వృద్ధి ఉంటుందని, ప్రస్తుత నెలలో పరిస్థితులు సానుకూల సంకేతాలను చూపిస్తున్నాయని మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ త్రిపాఠి చెప్పారు. గత కొన్ని నెలలుగా మెరుగైన స్థితిలోనే ఉన్నామని, ప్రైవేట్ పరిశ్రమల కంటే తమ కంపెనీ మెరుగ్గా పనిచేస్తోందని ప్రశాంత్ తెలిపారు. ఈ ఏడాది తొలి 7 నెలలు సంస్థ 9 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందని, గతేడాది ఉన్న 8 శాతం ప్రతికూలతతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉందన్నారు.
ఈ స్థాయి వృద్ధి నేపథ్యంలో మెజారిటీ మార్కెట్ వాటాను పొందుతున్నామని ప్రశాంత్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సాధించిన 11 శాతం మార్కెట్ వాటా గత పదేళ్లలో అత్యధికమని కంపెనీ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 10-15 శాతం పరిధిలో వృద్ధిని నమోదు చేయాలని లక్ష్యంగా ఉన్నామని కంపెనీ పేర్కొంది. కొవిడ్-19 మహమ్మారి సంబంధిత సవాళ్లతో మార్చిలో వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ, ఈ ఏడాదిని రెట్టింపు వృద్ధితో ముగించాలని సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న 9 శాతం వృద్ధిని 10 శాతంగా మార్చాలని ఆశిస్తున్నట్టు ప్రశాంత్ తెలిపారు.