‘మెటర్నిటీ ఫొటోషూట్’.. పదిలంగా అమ్మతనపు అనుభూతులు

by Shyam |
maternity photoshoot
X

దిశ, ఫీచర్స్: సృష్టికి మూలమైన మాతృత్వాన్ని పొందాలని ప్రతీ మహిళ కలలు కంటుంది. ఇక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్లు తెలిసిన రోజు నుంచి శిశువు జననం వరకు పుట్టబోయే బిడ్డ తలపుల్లోనే జీవిస్తుంది. ‘అమ్మ’ అన్న పిలుపు కోసం పరితపిస్తూ, బిడ్డకు కావల్సిన పోషకాలు అందించేందుకు డాక్టర్ల సూచనలు పాటిస్తుంది. ఆహారం పట్ల శ్రద్ధ వహిస్తూ అనుక్షణం జాగ్రత్తలు తీసుకుంటుంది. కుటుంబీకులు కూడా గర్భిణికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు.

ఈ క్రమంలో మెటర్నిటీ మధుర క్షణాలను అ‘పూర్వ’ జ్ఞాపకాలుగా మార్చుకునేందుకు సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఫొటోషూట్‌లు చేయించుకుంటున్నారు. ఇటీవల కాలంలో ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌లతో పాటు మెటర్నిటీ ఫొటోషూట్‌లు కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ ఫొటోషూట్‌లో భాగంగా కాబోయే తల్లులు సుందర ప్రదేశాల్లో ఫొటోలు దిగుతూ తమ మాతృత్వపు క్షణాలను పదిలపరుచుకుంటున్నారు. కాగా ప్రీ వెడ్డింగ్ పేరిట చేసే డర్టీ పనుల కంటే, అమ్మతనపు అనుభూతులను భద్రపరుచుకునేందుకు తీసుకునే ఫొటోషూట్‌లు మంచివేనని సోషల్ మీడియా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story