ఏకంగా రూ. 3 వేలు పెరిగిన వెండి ధర

by Harish |   ( Updated:2021-01-29 09:53:38.0  )
ఏకంగా రూ. 3 వేలు పెరిగిన వెండి ధర
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు బంగారం, వెండి ధరలు పెరిగాయి. అయితే, బంగారం స్వల్పంగా పెరగ్గా, వెండి ధర అమాంతం పెరిగింది. శుక్రవారం వెండి ధర కిలోకు ఏకంగా రూ. 3,915 వరకు పెరగడం గమనార్హం. బంగారం స్వల్పంగా 10 గ్రాములు రూ. 132 పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,650 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,800గా ఉంది.

ఇక, వెండిలో కిలో హైదరాబాద్‌లో రూ. 73,400గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరగడమే కాకుండా, మరో రెండు రోజుల్లో కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులు పెట్టడం సురక్షితమని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ కారణాంగానే దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం ఔన్స్ బంగారం ధర 1,844 డాలర్లు, వెండి ధర 26.35 డాలర్లుగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed