బ్యాటరీ కంపెనీలో దొంగతనం.. భారీగా నగదు చోరీ!

by Shyam |
Battery company
X

దిశ, రాజేంద్రనగర్ సర్కిల్: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి కాటేదాన్ పారిశ్రామికవాడలోని ఓ బ్యాటరీ కంపెనీలో ఆదివారం అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎస్సార్ బ్యాటరీ ఇండస్ట్రీ పేరుతో సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఓ బ్యాటరీ తయారీ పరిశ్రమను నిర్వహిస్తున్నాడు. అయితే పరిశ్రమ కార్యాలయంలో భారీ మొత్తంలో నగదును దాచాడు. ఆదివారం సెలవు కావడంతో పరిశ్రమకు రాలేదు. తిరిగి సోమవారం సుదర్శన్ రెడ్డి కంపెనీ కార్యాలయం తెరిచి చూడగా తలుపుకు వేసిన తాళం పగలగొట్టి ఉంది.

ఆఫీస్ బీరువాలో ఉన్న నగదును సైతం మాయం కావడంతో సుదర్శన్ రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరిస్తున్నారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, ఏసీపీ గంగాధర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు. రూ.50 లక్షల వరకు దొంగతనం జరిగినట్లు భావిస్తున్నారు. అయితే, అంత మొత్తంలో నగదును ఎందుకు దాచాడు. అదంతా ఎక్కడిదని పోలీసులు ఆరా తీసున్నారు. ఇది తెలిసిన వారి పనేనా లేక దొంగలు ఎవరైనా ఎత్తుకెళ్లారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఓ బ్యాటరీ పరిశ్రమలో అందులో పనిచేసే మేనేజర్ దొంగతనానికి పాల్పడ్డాడు.

Advertisement

Next Story