మూడు రాజధానులే కావాలి.. బాలయ్య కంచుకోటలో భారీ ర్యాలీ

by srinivas |
మూడు రాజధానులే కావాలి.. బాలయ్య కంచుకోటలో భారీ ర్యాలీ
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతియే ఏకైక రాజధాని కావాలంటూ అమరావతి రైతులు, మహిళలు మహాపాదయాత్ర చేస్తున్నారు. ఈనెల 17తో మహాపాదయాత్ర ముగుస్తున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులు వద్దు..ఒక్క రాజధానియే ముద్దు అంటూ న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో నాలుగు జిల్లాల్లో పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర ఇప్పటికే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పూర్తి చేసి రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. ఇలాంటి తరుణంలో అనంతపురం జిల్లా హిందూపురంలో మూడు రాజధానులకు మద్దతుగా భారీ ర్యాలీ చేపట్టారు. ఒక్క రాజధాని వద్దు.. మూడు రాజధానుల ముద్దు అనే నినాదంతో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. మరోవైపు విద్యార్థులు సైతం మానవహారం చేపట్టారు. ఒకవైపు ఏకైక రాజధాని కోసం అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్న తరుణంలో… హిందూపురంలో మూడు రాజధానుల కోసం నిరసన యాత్ర చేపట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story