- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పక్కా సమాచారంతో వైసీపీ ఇసుక దందా బయటపెట్టిన టీడీపీ నేత
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ఒక్క రోజుకు సుమారు 2 వేల లారీల ఇసుక అక్రమంగా రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు అనుమతి లేకుండా తరలిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. విజయవాడలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఇసుక తవ్వకాల్లో నెలకు రూ. 600 కోట్లకు పైగా అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం జేపీ కంపెనీ ద్వారా ఎంత ఇసుక తవ్వకాలు జరిపారు.. ఎంత సరఫరా చేశారనే విషయంపై సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం పొంది వాటిల్లోని లెక్కలను బయటపెట్టారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక పాలసీతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం ఇసుక టన్ను రూ. 475 ధరగా నిర్ణయించామని చెప్పారని, ఇప్పుడు రూ. 900 పైగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. డ్రెడ్జింగ్ ద్వారా వచ్చిన రూ. 570 కోట్ల విలువైన ఇసుకను జేపీ కంపెనీకి ఇవ్వడం దారుణమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.