పరవాడ మంటల్లో చిక్కి ఒకరు మృతి!

by srinivas |   ( Updated:2020-07-14 00:17:27.0  )
పరవాడ మంటల్లో చిక్కి ఒకరు మృతి!
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ పరవాడలోని రాంకీ ఫార్మాసిటీ సాల్వెంట్స్ కెంపెనీలో పేలుడు ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు సీనియర్ కెమిస్ట్ శ్రీనివాస్(40)గా గుర్తించినట్లు సమాచారం. పరిశ్రమలో పేలుడు తర్వాత అతనికి ఆచూకీ తెల్వలేదు. మంగళవారం ఉదయం ఘటనా స్థలిలో శిథిలాల కింద అతడి మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిసింది. అయితే అతడి మృతిపై ఇంతవరకు కంపెనీ యాజమాన్యం, పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, సోమవారం రాత్రి కంపెనీలో ట్యాంక్ పేలి మంటలు అంటుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement

Next Story