మాస్క్‌‌లకు ఓ ఏటీఏం

by Shyam |   ( Updated:2021-05-17 01:26:24.0  )
మాస్క్‌‌లకు  ఓ  ఏటీఏం
X

దిశ, వెబ్ డెస్క్ : చాలా మంది తొందరలో మాస్క్ మర్చిపోయి వస్తూంటారు. అయితే అలా మాస్క్ మర్చిపోయి బయిటికి వెళ్లేవారి కోసం వినూత్నంగా ఆలోచించి ఓ యంత్రాన్ని తయారు చేశారు సూరత్ కు చెందిన ఓ సామాజిక కార్య కర్త. ఏంటీ ఆ యంత్రం అనుకుంటున్నారా ? మనం కార్డు పెడితే ఏటీఏంలో డబ్బులు ఏలా అయితే వస్తాయో రూపాయి కాయిన్ వేస్తే ఓమిషన్ నుంచి మాస్క్అలా వస్తుంది. అయితే ఈ వెండింగ్ మిషన్లో 100 నుంచి 5,000 మాస్క్ పొందుపరిచి ఉంటాయి.

దీంతో మనం మాస్క్ మర్చిపోయినా ఒక్కరూపాయితో మాస్క్ తీసుకోవచ్చు. ఈ మిషన్ ని సామాజిక కార్యకర్త ఆమె స్నేహితుడి సహాయంతో రూపొందించింది. అయితే ముందుగా దీనిని మహిళలకు శానిటరీ ప్యాడ్స్ అందుబాటులో ఉంచడానికి తయారు చేశారు కానీ కొవిడ్ వ్యాప్తినేపథ్యంలో మాస్క్ ల పంపిణీకి ఉపయోగిస్తున్నారు. ఈ మిషన్ లను స్వచ్ఛంద సంస్థల సహాయంతో రైల్వేస్టేషన్లు, బస్టాండులు వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్టు సామాజిక కార్యకర్త రూపా షా తెలిపారు.

Advertisement

Next Story